హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.