హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం కోసం పల్లె నుంచి పట్నానికి..!

HYD: హుస్సేన్ సాగర్‌లో గణపతి నిమజ్జనాల కోసం రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి కూడా విగ్రహాలను తీసుకొస్తున్నారు. నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్ క్రమంగా ముందుకు సాగుతోంది. మరోవైపు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. నేడు రాత్రి తర్వాత ట్రాఫిక్ రద్దీ క్రమంగా తగ్గే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు.