హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో గుర్తుతెలియని మృతదేహం

TPT: సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వెళ్లే మార్గంలోని దావదగుంట చెరువులో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టీషర్ట్ ధరించి ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసే చర్యలు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.