CTR: కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మురళీకృష్ణ సూచించారు. శనివారం పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశారు. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నారులు కూడా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని డాక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు'


