హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కోహెడ మండలం తీగలకుంటపల్లిలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి హాజరయ్యారు. రజక సంఘం అధ్యక్షుడు జాలిగాం బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.