హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత బావితో భయం

SRPT: జిల్లా కేంద్రంలోని 25వ వార్డు నాగులమ్మ గుడి సమీపంలో 50 ఏళ్ల నాటి పాత బావి పాములు, దోమలకు నిలయంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బావి వద్ద మహిళలు నిరసన తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని, అధికారులు వెంటనే స్పందించి బావిని పూడ్చివేయాలని డిమాండ్ చేశారు.