హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛత్రపతి శివాజి విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి

KNR: చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో గుమ్లాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ వడ్లురి సరిత, కమిషనర్ నాగరాజు, పాలకవర్గ సభ్యులకు శనివారం వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని వివిధ వార్డు ప్రజలు, కుల, యూత్, మహిళా సంఘాల తీర్మాణాలతో కూడిన ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.