హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుట్టాయగూడెంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

ELR: బుట్టాయగూడెంలోని రామ నరసయ్య భవనంలో శనివారం అఖిల భారత రైతు కూలీ సంఘం నాలుగో జాతీయ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ మాట్లాడారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో AIKMS 4వ జాతీయ మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని ఆయన వెల్లడించారు.