TPT: సూళ్లూరుపేట టోల్‌గేట్ వద్ద ఎంవీఐ ఇన్‌స్పెక్టర్ అనిల్ వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ కంపెనీ బస్సును గుర్తించి చర్యలు తీసుకున్నారు. ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలు సక్రమంగా లేకపోవడంతో బస్సుకు రూ.1.74 లక్షల జరిమానా విధించారు. తనిఖీల్లో పత్రాల లోపాలను గుర్తించిన అధికారులు బస్సును పరిశీలించి చలానా జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పత్రాలు లేకపోవడంతో బస్సుకు భారీ ఫైన్


