TPT: తిరుమలలోని వరాహ స్వామి గెస్ట్ హౌస్ వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. వాహనాల్లో బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర భాగాలు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల అవగాహన


