E.G: రాజమండ్రి నగర అభివృద్ధికి HAM పథకం కింద రూ. 300 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు, పార్కుల నిర్మాణం చేపడతామన్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి అభివృద్ధికి రూ. 300 కోట్లు: ఎమ్మెల్యే


