హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో పట్టపగలే దొంగతనం

KRNL: ఆదోని పట్టణంలో శనివారం దొంగలు హల్‌చల్ చేశారు. పంచలింగాల శివాలయం వెనుక కంకర మిషన్ సమీపంలో వడ్డే గోపాల్, వడ్డే మహానంది నివాసం ఉంటున్నారు. పొలానికి వెళ్లిన సమయంలో వీరి ఇళ్లలోకి దొంగలు ప్రవేశించారు. రెండు ఉంగరాలు, రెండు జతల కమ్మలు, రూ.2.04 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు వాపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.