KRNL: ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీలో గుడిసెలపై విద్యుత్ తీగలు వేలాడుతూ చేతికి అందుతున్నాయని నాయకులు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయపడుతున్నారని పేర్కొన్నారు. స్తంభం నంబర్ 81ను తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని కోరారు. వేలాడుతున్న తీగలను వెంటనే మార్చి ప్రమాదాలు నివారించాలని విద్యుత్ అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు


