హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోండి'

MBNR: జిల్లాలోని ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు ఏ.సంజీవ్ ముదిరాజ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రామచంద్రాపురం శ్మశాన వాటిక, అమిస్తాపూర్‌లోని వక్ఫ్ భూమి, బాగ్మార్ సాహెబ్ దర్గా సమీపంలోని స్థలంపై అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన చేపట్టి ఆక్రమణలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.