హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ

CTR: పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. ఉపకార వేతనాలను నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నామని తెలిపారు. టీసీ కావాల్సిన విద్యార్థులు తగిన ఆధారాలు చూపించి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.