హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ: కలెక్టర్

PDPL: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.