SKLM: నాగావళి నది ఉధృతితో ముంపునకు గురైన సింగూరు, మొదలవలస, బొడ్డేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన


