హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీజ్ చేసిన కార్ల పేరుతో రూ.18 లక్షల మోసం

NLR: సీజ్ చేసిన నాలుగు కార్లను విక్రయిస్తానని నమ్మించి రూ.18 లక్షలు తీసుకుని మోసగించిన ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. జెండావీధికి చెందిన జహీర్‌కు కడపకు చెందిన అఖిల్ అహ్మద్ పరిచయం అయ్యాడు. కార్లు ఇప్పిస్తానని చెప్పి జహీర్, అతని స్నేహితుల ఖాతాల నుంచి రూ.12 లక్షలు, నగదు రూపంలో మరో రూ.6 లక్షలు తీసుకున్నాడు.