హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈవీఎంలను రద్దు చేయాలి'

NDL: శ్రీశైలం తహసీల్దార్ కార్యాలయంలో సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా నేతలు వినతిపత్రం అందజేశారు. ఈవీఎంలను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని కోరారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడి ఓటు హక్కును పరిరక్షించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.