హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో ఆక్రమణలపై అధికారుల కొరడా

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశాలతో పట్టణ ప్రణాళిక అధికారులు రోడ్లు, ఫుట్ పాత్‌లపై ఆక్రమణలను శనివారం తొలగించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఏవీఏ రోడ్డు ప్రసాద్ ఆదిత్య మాల్ పరిసరాలు, గెయిల్ ఆఫీస్ ఎదురు రోడ్డులోని ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.