KMM: ఇటీవల కురిసిన వర్షాలకు మధిర బస్టాండ్ ఆవరణ బురదమయంగా మారింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిలిచిపోవడంతో బురద ఏర్పడిందని ప్రయాణికులు తెలిపారు. అధికారులు సత్వరమే స్పందించి బస్టాండ్ ఆవరణలో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని, తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా శాశ్వత మార్గం చూపాలని కోరారు.
తెలంగాణ
బురదమయంగా మారిన బస్టాండ్


