హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ పోరాటం స్ఫూర్తి చిరస్మరణీయం : MLC

KMM: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఐలమ్మ 131వ జయంతి నిర్వహించి నివాళులర్పించారు. నిజాం, దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకీ వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ జయంతికి అధికారిక గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ  కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాల్గొన్నారు.