హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మట్, డేవిడ్‌లు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.