హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో రేషన్ కార్డుల పంపిణీ

SRCL: వేములవాడ పట్టణంలోని 10వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ సిరిగిరి శ్రీకాంత్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. రేషన్ కార్డుల ద్వారా అర్హ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు. వారం రోజుల పాటు వార్డులోని రేషన్ షాప్‌లో కార్డుల పంపిణీ కొనసాగుతుందని అన్నారు.