హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త కత్తి దాడిలో తల్లీకూతుళ్లు మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు (M) ఏల్చూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భర్త ఎం. వసంత రాయుడు కత్తితో దాడి చేయడంతో భార్య వీరనారాయణమ్మ (30) తీవ్రంగా గాయపడి గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటనలో ఆమె తల్లి బ్రహ్మేశ్వరమ్మ (52) కూడా శుక్రవారం రాత్రి మృతి చెందారు. తల్లీ, కుమార్తెలు మృతి చెందటంతో స్థానికంగా విషాదకర వాతావరణం నెలకొంది.