హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో సత్తా చాటిన విద్యార్థులు

CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 17 మంది విద్యార్థులు జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అన్నారి శనివారం తెలిపారు. పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పుంగనూరు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల బృందం అభినందించింది. కార్యక్రమంలో పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు.