హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్రిగూడలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

NLG: మర్రిగూడ మండల కేంద్రంలో రజక సంఘం మరియు మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. పలువురు నాయకులు ఉన్నారు.