హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలోకి దూకిన మహిళ..!

ELR: తాడేపల్లిగూడెంలో మహిళ ఏలూరు ప్రధాన కాలువలోకి దూకేసిందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రెస్క్యూ టీం కాలువలో గాలింపు చర్య చేపట్టింది. తాడేపల్లిగూడెం నుంచి బాదంపూడి, నాచుగుంట, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు వరకు ఏలూరు ప్రధాన కాలువలో బోటు సహాయంతో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేశారు. మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు, పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.