W.G: ఆకివీడులో తక్కువ ఖర్చుతో వైద్య సేవలందించిన మందపాటి రఘునాథరాజు వర్ధంతి శనివారం ఘనంగా జరిగింది. కలిదిండి ఇంద్రరాజు, కౌన్సిలర్ అరుణకుమారి, నాగరాజు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, అన్నదానం చేశారు. కొల్లేరు తీర ప్రజలకు ఆయన చేసిన వైద్య సేవలు మరువలేనివని కొనియాడారు. రఘునాథరాజు చూపిన సేవా మార్గం అందరికీ ఆదర్శనీయమని వక్తలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల వైద్యుడి వర్ధంతి.. ఆకివీడులో నివాళి


