హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

ASR: చింతపల్లి మండలం మల్లవరం, గడపరాయిలో శనివారం ఏవో మధుసూదనరావు పర్యటించారు. ఈ సందర్భంగా వరి, రాజ్‌మా, వేరుశనగ పంటలను పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కాలువల వద్ద ఎక్కడైనా నీరు నిలిచినట్లయితే రైతులు గట్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపించాలన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.