PLD: స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు 27న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని ఎస్పీ జగదీష్ తెలిపారు. భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 25 నుంచి 29 వరకు సెలవులు రద్దు చేసినందున ఉద్యోగులు విధులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'చలో విజయవాడ' కు అనుమతి లేదు


