హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'

MNCL: బెల్లంపల్లి మండల MAO సుద్దాల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామంలో శనివారం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందాలంటే పట్టా పాస్ బుక్ కలిగివున్న ప్రతి రైతు కూడా విధిగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేని వారికి పత్తి, వరి కొనుగోలు ఇబ్బందికరంగా మారుతుందన్నారు.