హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సాగునీరు అందించడమే కర్తవ్యం: కడియం

JN: వర్షపు నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరుగా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని MLA కడియం శ్రీహరి అన్నారు. ​ఇటీవల కురిసిన వర్షాలకు రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామం వద్ద వాగులో వరదనీరు వృథాగా పోతుండటాన్ని MLA గమనించారు. వెంటనే స్పందించి నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి, నీటిని మళ్ళించే ప్రక్రియను నేడు ప్రారంభించారు.