హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముప్పాళ్లలో భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జనం

NTR: ముప్పాళ్ల గ్రామంలో గణనాథుడి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసినిమజ్జన రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి నిమజ్జనం విజయవంతంగా జరగాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.