హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బనానా బొటాక్స్‌ ప్రయత్నించారా?

అరటిపండు తొక్కతో బొటాక్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ వైరల్ అవుతోంది. తొక్క లోపలి భాగాన్ని ముఖానికి రాస్తే ముడతలు మాయమై చర్మం బిగుతుగా మారుతుందని చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. తొక్కలో పోషకాలు ఉన్నా, బొటాక్స్‌లా పనిచేయదు. సున్నిత చర్మానికి అలర్జీలు రావచ్చు. సహజమైనదైనా, ప్రయత్నించేముందు ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి.