హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి సన్నిధిలో ఎంపీ పురందేశ్వరి

EG: కోల్ కతాలోని కాళీఘాట్లో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ కాళికా దేవి అమ్మవారి ఆలయాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగజ్జనని కాళికా మాత అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.