హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరీ నదిలో ఘనంగా వినాయక నిమజ్జనాలు

NRML: గోదావరి నదిలో నిమజ్జనానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు భారీగా బాసరకు తరలివస్తున్నాయి. వంతెనపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, రెవిన్యూ శాఖల అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగు క్రేన్‌ల సహాయంతో వినాయక నిమజ్జనం జరుగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫైర్ ఇంజిన్‌లు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు విధుల్లో ఉన్నారు.