MHBD: గూడూరు మండలం సీతానగరానికి చెందిన భాగ్యమ్మ భర్త మూడేళ్ల క్రితం మృతి చెందడంతో వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటి పన్ను చెల్లించలేదని పంచాయతీ కార్యదర్శి, కారోబార్ తన దరఖాస్తును పక్కన పెట్టారని ఆమె ఆరోపించారు. అధికారులు స్పందించి వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇంటి పన్ను కట్టలేదని పెన్షన్ దరఖాస్తు తిరస్కరణ


