హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నదిలో దూకిన వ్యక్తిని కాపాడిన ఎస్సై

GNTR: తాడేపల్లిలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భార్య అనారోగ్యంతో మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు (64) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. వారధి వద్ద సహాయం కోసం కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్‌ ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి బోటు ద్వారా చేరుకుని నాగేశ్వరరావును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.