హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ ఘటనపై స్పందించిన బాలల హక్కుల కమిషన్

ATP: ఆత్మకూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవనంపై నుంచి పడి గాయపడటం బాధాకరమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదనరావు ఇవాళ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని డీసీపీవోను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. పిల్లల భద్రతలో అశ్రద్ద వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.