హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎయిడ్స్‌పై అవగాహన కోసం 5k రెడ్ రన్'

శ్రీకాకుళం: యువతలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి '5కె రెడ్ రన్ ' నిర్దేశిత లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు. 80 అడుగుల రోడ్డులో గల వాంబే కాలనీ నుంచి మిల్ జంక్షన్ వరకు 5కె రెడ్ రన్ ను అదనపు డిఎంహెచ్ఐ డాక్టర్ తాడేల శ్రీకాంత్‌తో కలసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు.