హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలతో పెరిగిన వరి సాగు విస్తీర్ణం

AKP: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పాయకరావుపేట మండలంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. వర్షాలకు ముందు వరకు 565 హెక్టార్లలో వరినాట్లు పడగా వర్షాల తరువాత 810 హెక్టార్లకు వరి సాగు విస్తరణ పెరిగినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ ఇవాళ తెలిపారు. ఈ నెలాఖరులోగా మరో 200 హెక్టార్లలో వరినట్లు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.