హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు

SRCL: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం మంత్రులు నివాళులర్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరనారి ప్రదర్శించిన ధైర్య సాహసాలను కొనియాడారు.