హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

CTR: రజక ఐలమ్మ 131వ జయంతిని రజక సంఘం నాయకులు పుంగనూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె పోరాటపటిమను కొనియాడారు. 17 రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్న రజకులను ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.