హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొంరాస్‌పేటలో శతాధిక వృద్ధురాలు మృతి

VKB: బొంరాస్‌పేట మండలంలోని జానకంపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఇరువటి చిన్న బుగ్గమ్మ (105) నిన్న శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణాలతో అనారోగ్యానికి గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంద ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉండేదని వారు పేర్కొన్నారు.