హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

MDK: తూప్రాన్ పట్టణంలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాటపటిమను గుర్తు చేసుకుంటూ ఆమె సేవలను స్మరించారు.