NTR: గన్నవరం విమానాశ్రయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓ కుటుంబం కలిసింది. గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా తమ పాపకు ఉచితంగా న్యూరో సర్జరీ జరిగిందని, అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చినట్లు చిన్నారి తండ్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన జగన్, ఆమె కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగి ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిన్నారితో జగన్ సెల్ఫీ


