హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీవ్ నగర్ కాలనీలో మెగా కార్డాన్ సెర్చ్

TPT: శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు మెగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు.