MLG: తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీకి శనివారం భారీ వరద కొనసాగుతోంది. 83 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 80.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 4,93,600 క్యూసెక్కుల వరద వస్తుండగా, స్పిల్ వే గేట్ల ద్వారా 4,68,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
గోదావరి ఉగ్రరూపం.. 4.93 లక్షల క్యూసెక్కుల వరద


