హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

RR: షాద్‌నగర్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.